నిర్మాతల సంచలన నిర్ణయం .. తమిళ 'అర్జున్ రెడ్డి' పూర్తిగా రీషూట్!

తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా చేసిన 'అర్జున్ రెడ్డి' సంచలన విజయాన్ని సాధించింది. దాంతో విక్రమ్ తనయుడు 'ధృవ్' హీరోగా తమిళంలో ఈ సినిమాను 'వర్మ' టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. బాల దర్శకత్వంలో 'ఈ ఫోర్ ఎంటర్టైన్మెంట్' వారు నిర్మిస్తోన్న ఈ సినిమా ఇటీవలే చిత్రీకరణను పూర్తిచేసుకుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా భావిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొత్తం అవుట్ పుట్ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన నిర్మాతలు, మొదటి నుంచి రీషూట్ చేయాలనే అభిప్రాయానికి వచ్చేశారు. హీరో 'ధృవ్' ను మాత్రమే వుంచి, దర్శకుడితో పాటు మిగతా నటీనటులను .. సాంకేతిక నిపుణులను మార్చేయాలనే నిర్ణయం తీసేసుకున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా చేశారు. ఈ విషయమే ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.
Go Back to Shorts
dhruv vikram

More Telugu News