'వజ్రకవచధర గోవింద' నుంచి టీజర్ రిలీజ్
Add ap7am to your home Screen

'వజ్రకవచధర గోవింద' నుంచి టీజర్ రిలీజ్

  • హీరోగా సప్తగిరి మరో ప్రయత్నం
  • డిఫరెంట్ టైటిల్ .. డిఫరెంట్ లుక్
  • దర్శకుడిగా అరుణ్ పవార్
సప్తగిరి హీరోగా .. అరుణ్ పవార్ దర్శకత్వంలో 'వజ్రకవచధర గోవింద' సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. సప్తగిరి వాయిస్ పై .. అందుకు సంబంధించిన విజువల్స్ పై ఈ టీజర్ ను కట్ చేశారు.

"నేనో వలస పక్షిని .. నాకంటూ ఒక గమ్యం లేదు .. నన్ను వెతుక్కుంటూ ఒక నలుగురు వచ్చారు .. స్నేహితులన్నారు. ఓ అందమైన అమ్మాయి వచ్చింది .. ప్రియురాలు అంది. నేనెప్పుడూ వినని .. వెళ్లని చోటు నుంచి గుంపులు గుంపులుగా వందలమంది వచ్చారు .. శత్రువులమన్నారు. ఇక మేక .. పులి ఆట మొదలైంది. నా ధైర్యం .. నా ఆయుధం .. నా సంకల్ప బలం" అంటూ ఈ వాయిస్ ఓవర్ కొనసాగింది. డిఫరెంట్ టైటిల్ తో .. డిఫరెంట్ లుక్ తో రూపొందుతోన్న ఈ సినిమా సప్తగిరిని హీరోగా నిలబెడుతుందేమో చూడాలి. 
       
saptagiri

More Telugu News