కమల్ కోసం అనుకుంటే .. ఆ ఛాన్స్ విక్రమ్ కి దక్కిందట!
- కమల్ సొంత బ్యానర్లో మూవీ
- మలేసియాలో జరుగుతోన్న షూటింగ్
- వేసవిలో ప్రేక్షకుల ముందుకు
విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ముందుగా కమల్ కథానాయకుడిగానే ఈ సినిమా కథాకథనాలు సిద్ధమయ్యాయి. అయితే రాజకీయాలకే ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్న కమల్, విక్రమ్ తో చేద్దామని చెప్పి ఆయనను సెట్ చేశారట. కమల్ బ్యానర్లో ఇంతవరకూ ముగ్గురు బయట హీరోలు మాత్రమే చేశారు .. ఆ జాబితాలో నాలుగో హీరోగా విక్రమ్ చేరారని చెప్పుకుంటున్నారు. పూర్తిగా మలేసియాలో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమాను, వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.