మారుతి దర్శకత్వంలో మెగాహీరో
- తేజు హీరోగా 'చిత్రలహరి'
- తదుపరి సినిమా మారుతితో
- త్వరలోనే పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
గీతా 2 .. యూవీ క్రియేషన్స్ వారు కలిసి ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి నానితో ఓ సినిమా చేయాలని మారుతి అనుకున్నాడు. కానీ నాని ఇతర కమిట్మెంట్స్ కారణంగా కుదరలేదు. దాంతో తేజుతో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి మారుతి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ప్రస్తుతం కిషోర్ తిరుమలతో చేస్తోన్న 'చిత్రలహరి' .. ఆ తరువాత మారుతితో చేయనున్న సినిమా తనకి ఈ ఏడాది హిట్స్ తెచ్చిపెడతాయని తేజు భావిస్తున్నాడు. ఆయన ఆశ నెరవేరుతుందేమో చూడాలి మరి.