ఏపీ పోలీసులపై నమ్మకం లేదని జయరాం భార్య హైదరాబాద్ లో ఫిర్యాదు చేసింది... సిగ్గనిపించడం లేదా చంద్రబాబూ?: విజయసాయిరెడ్డి
Add ap7am to your home Screen

ఏపీ పోలీసులపై నమ్మకం లేదని జయరాం భార్య హైదరాబాద్ లో ఫిర్యాదు చేసింది... సిగ్గనిపించడం లేదా చంద్రబాబూ?: విజయసాయిరెడ్డి

  • ఏపీ సీఎంపై వైసీసీ నేత విమర్శలు
  • పోలీసుల ప్రతిష్ఠ దిగజార్చారని మండిపాటు
  • జగన్ పై దాడి కేసును నిర్వీర్యం చేశారని వ్యాఖ్య
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఈరోజు విరుచుకుపడ్డారు. ఏపీ పోలీస్ ప్రతిష్ఠను చంద్రబాబు సర్వనాశనం చేశారని ఆయన విమర్శించారు.

ఈరోజు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ఏపీ పోలీసు ప్రతిష్ఠను సర్వనాశనం చేసిన ఘనత చంద్రబాబు గారిది. జగన్ గారి హత్యాయత్నం కేసును నిర్వీర్యం చేసే యత్నం చేశాడు. ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసుకు అదే గతి పట్టించాడు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని మృతుని భార్య హైదరాబాద్ లో ఫిర్యాదు చేసింది. సిగ్గనిపించడం లేదా బాబూ?’ అని ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Police
dilaution
Chandrababu
Telugudesam
YSRCP
Vijay Sai Reddy

More Telugu News