రాజకీయాల్లోకి టీవీ ‘రాముడు’.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న అరుణ్ గోవిల్

ఎనభయ్యో దశకంలో దేశ ప్రజలను విశేషంగా ఆకర్షించిన రామానంద్ సాగర్ ‘రామాయణం’లో నటించిన అరుణ్ గోవిల్ ఎంతో పేరు సంపాదించుకున్నాడు. రాముడిగా అరుణ్ నటకు దేశం ఫిదా అయింది. ఇప్పుడీ ‘రాముడు’ రాజకీయాల్లోకి రాబోతున్నాడు. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరబోతున్న అరుణ్ గోవిల్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి బరిలోకి దిగబోతున్నట్టు సమాచారం.  

బీజేపీకి కంచుకోట అయిన ఇండోర్‌లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ అక్కడి నుంచి అరుణ్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీ ఎంపీ, ప్రస్తుత లోక్‌సభ స్పీకర్ అయిన సుమిత్రా మహాజన్‌కు ఇండోర్‌లో గట్టి పట్టుంది. అక్కడ ఆమెను ఢీకొట్టి గెలవడం కాంగ్రెస్‌కు సవాలుగా మారింది. ఇప్పటికి ఎనిమిదిసార్లు అక్కడ కాంగ్రెస్ పరాజయం పాలైంది. దీంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న హస్తం పార్టీ అరుణ్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
BJP
Congress
Madhya Pradesh
Indore
Arun Govil

More Telugu News