బాపుగారు .. బాలుగారు అంటే ఎంతో ఇష్టం: నటి రోహిణి
Add ap7am to your home Screen

బాపుగారు .. బాలుగారు అంటే ఎంతో ఇష్టం: నటి రోహిణి

  • బాపుగారి సినిమా 'త్యాగయ్య' చేశాను
  • నన్ను శ్రీరాముడిగా చూపించారు
  • బాలుగారికి బాధపెట్టడం తెలియదు  
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో రోహిణి మాట్లాడుతూ, దర్శకుడు బాపు .. మధుర గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రస్తావించారు. "బాపుగారి గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఆయన దర్శకత్వంలో నేను 'త్యాగయ్య' సినిమాలో నటించాను. సోమయాజులు కూతురుగా ఆ సినిమాలో నేను కనిపిస్తాను. ఒక సందర్భంలో నేను 'త్యాగయ్య'కి శ్రీరాముడిగా కనిపిస్తాను. అప్పుడు నాతో రాముడు వేషం వేయించారు. ధనుస్సును నేను ఎలా పట్టుకోవాలనేది బాపుగారు బొమ్మగీసి చూపించారు. అంత గొప్ప దర్శకుడిని నేను చూడలేదు.

ఇక బాలుగారి విషయానికొస్తే .. ఆయనని చూస్తే ఇంత మంచితనంతో ఒక మనిషి వుండగలరా అనిపిస్తుంది. చుట్టూ ఏం జరుగుతున్నా కోపమే రాకుండా ఉండటం సాధ్యపడుతుందా అనిపిస్తుంది. ఆయనను కలిసినవారు ఎవరైనా సంతోషంగా అక్కడి నుంచి వెళతారు. ఆయన ఎప్పుడూ ఎక్కడా ఎవరినీ బాధపెట్టిన దాఖలాలు లేవు .. ఆయన వ్యక్తిత్వం నాకు బాగా నచ్చుతుంది" అని చెప్పుకొచ్చారు. 
rohini
ali

More Telugu News