నాపై ఇలాంటి అసత్య ప్రచారాలు తగవు: వైసీపీ నేత మేకపాటి
- నేను పార్టీ వీడుతున్నానన్న వార్తలు అబద్ధం
- కొన్ని మీడియా సంస్థల దుష్ప్రచారం తగదు
- వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తా
వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచి జగన్ తో కలిసి పని చేస్తున్నానని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుపై ఆయన విమర్శలు చేశారు. ఏపీకి మోదీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, చంద్రబాబు వంచనతో ప్రజలు విసిగిపోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని సాధించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని, అవి సాధించిన తర్వాతే ప్రజలను ఓటు వేయమని అడిగే హక్కు బాబుకు ఉందని వ్యాఖ్యానించారు.