పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తన సభ్యులకు విప్ జారీచేసిన కాంగ్రెస్
- మూడు లైన్లలో సమాచారం అందజేసిన అధిష్ఠానం
- నేడు, రేపు సభకు కచ్చితంగా హాజరు కావాలని ఆదేశం
- ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అనారోగ్యం కారణంగా రాలేని పరిస్థితి ఉండడంతో, ఆయన స్థానంలో మరో కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ శుక్రవారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఈ సెషన్ కొనసాగనున్నది. ఈ నేపధ్యంలో అత్యవసర పరిస్థితిలో ఉపయుక్తమవుతుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు.