హీరోయిన్లను డిన్నర్ కు పిలిచారంటే అర్థమేంటో తెలుసా?: షెర్లిన్ చోప్రా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరోయిన్లను డిన్నర్ కు పిలిచారంటే అర్థమేంటో తెలుసా?: షెర్లిన్ చోప్రా

  • నటీమణులను డిన్నర్ కు పిలుస్తారు
  • డిన్నర్ అంటే భోజనానికి పిలుస్తున్నారని కాదు
  • శారీరక సుఖం కోసం పిలుస్తున్నారని అర్థం చేసుకోవాలి
బాలీవుడ్ లో డిన్నర్ అనే పదానికి అర్థమేంటో నటి షెర్లిన్ చోప్రా వివరించింది. ముంబైలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సంచలన వాస్తవాలను వెల్లడించింది. 'నటీమణులను దర్శకులు, నిర్మాతలు అప్పుడప్పుడు డిన్నర్ కు పిలుస్తుంటారు. వాళ్లు పిలుస్తున్నది భోజనానికి మాత్రమే కాదని అర్థం చేసుకోవాలి. శారీరక సుఖం కోసం వారు పిలుస్తున్నారనే విషయాన్ని గ్రహించాలి. నాకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. అవకాశాల కోసం వెళ్లినప్పుడు రాత్రి వారి ఆఫీసులకు డిన్నర్ కు పిలిచేవారు. మొదట్లో అనుమానం వచ్చేది. ఆ తర్వాత పూర్తిగా అర్థమైంది. దీంతో అప్పటి నుంచి ప్రతిభ కలిగిన దర్శకులు, నిర్మాతలనే కలుసుకోవాలని నిర్ణయించుకున్నా. చిన్నచిన్న పట్టణాల నుంచి వచ్చిన వారికి ఇలాంటి అనుభవాలు ఎక్కువగా ఎదురవుతాయి' అని షెర్లిన్ తెలిపింది. 
bollywood
dinner
meaning
sherlyn chopra

More Telugu News