హిట్ మూవీ రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్
- తమిళంలో హిట్ కొట్టిన 'రాచ్చసన్'
- తెలుగు రీమేక్ దర్శకుడిగా రమేశ్ వర్మ
- త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
సైకలాజికల్ థ్రిల్లర్ గా సాగే ఈ సినిమాను తమిళంలో రామ్ కుమార్ తెరకెక్కించాడు. తెలుగులో ఈ సినిమాకి రమేశ్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ఆయన నుంచి 'వీర' .. 'రైడ్' సినిమాలు వచ్చాయి. ఇది బెల్లంకొండ శ్రీనివాస్ నటనను మరో కోణంలో ఆవిష్కరించే సినిమా అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం కథానాయికను ఎంపిక చేసే పనిలో ఉన్నారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.