గొలుసు దొంగపై సివంగిలా దూకిన మహిళ... దెబ్బకు పరార్!

తన మెడలోని బంగారు గొలుసును తెంచుకెళ్లేందుకు వచ్చిన దొంగను హైదరాబాద్ కు చెందిన మహిళ చాకచక్యంగా ఎదుర్కొని ప్రశంసలు అందుకుంటోంది. ఆమె చూపిన ధైర్యాన్ని సీసీటీవీ ఫుటేజ్ లో చూసిన పోలీసులు సైతం ఆమెను అభినందించారు. ఈ ఘటన రాజేంద్రనగర్‌, సమీపంలోని అత్తాపూర్‌, వాసుదేవారెడ్డి నగర్‌ లో జరిగింది. ఇక్కడ ఓ కిరాణ దుకాణం నడుపుకుంటున్న మంజుల అనే మహిళ, ఉదయం 6 గంటల సమయంలో షాపు తీసేందుకు వచ్చిన వేళ, ఈ ఘటన జరిగింది.

 అంతకుముందు రోజే పోలీసులు ఆ ప్రాంతంలో చైన్ స్నాచర్ల గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఆ సమయంలో బైకుపై కూర్చుని ఉన్న ఓ వ్యక్తి, తన ఫోన్ లో మాట్లాడుతూ ఉండటాన్ని గమనించింది. అతనిపై అనుమానంతోనే, దుకాణం తెరిచేందుకు సిద్ధమవుతుండగా, వెనుకనుంచి వచ్చిన అతను, మెడలోని గొలుసును లాగబోయాడు. అప్పటికే అప్రమత్తంగా ఉన్న ఆమె, వెంటనే తిరగబడింది. పెద్దగా కేకలు పెడుతూ, రాయి తీసుకుని విసిరింది. దీంతో ఆ దొంగ పలాయనం చిత్తగించాడు. ఆ దొంగ ఎవరో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Hyderabad
Attapur
Chine Snatcher
Thief
Lady
Police

More Telugu News