పెళ్లికి నో చెప్పిన మహిళ.. కోపంతో యాసిడ్ పోసిన యువకుడు.. ఆపై తానూ ఆత్మహత్య!

19-01-2019 Sat 13:57 | National
  • తమిళనాడులోని కన్యాకుమారిలో ఘటన
  • పిల్లలు ఉండటంతో వివాహానికి నిరాకరించిన మహిళ
  • పోలీసుల భయంతో ఆత్మహత్య చేసుకున్న నిందితుడు
తాను ప్రేమించిన మహిళ వివాహానికి ఒప్పుకోకపోవడంతో ఓ వ్యక్తి రాక్షసుడిగా మారాడు. ఆమె జీవితాన్ని నాశనం చేసేందుకు యాసిడ్ తో దాడిచేశాడు. చివరికి పోలీసుల భయంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారిలో చోటుచేసుకుంది.

ఇక్కడి తిరువట్టార్‌ సమీపంలో ఓ మహిళ(36) తన ఇద్దరు మైనర్ పిల్లలతో కలిసి ఉంటోంది. భర్త చనిపోవడంతో ఆమె పనిచేసుకుంటూ ఇద్దరు చిన్నారులను పోషించుకుంటోంది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన జాన్‌రోస్‌ (30)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. దీంతో పెళ్లి చేసుకుందామని ఆమెకు జాన్ చెప్పాడు. అయితే తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారనీ, ఇప్పుడు వివాహం చేసుకోలేనని ఆమె తేల్చిచెప్పింది. దీంతో కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన జాన్ ఇంకోసారి సదరు మహిళ ఇంటికి వెళ్లి పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు.

ఇందుకు ఆమె నిరాకరించడంతో జాన్ రాక్షసుడిగా మారిపోయాడు. తన వెంట తెచ్చుకున్న యాసిడ్ ను ఆమెపై పోసి పరారయ్యాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానికులు, బంధువులు ఆచ్చారిపల్లం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు జాన్ కోసం గాలింపును ముమ్మరం చేశారు. ఈ విషయం తెలుసుకున్న జాన్ భయంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
Tamilnaduacid attacksuicidekanya kumariPolicewidow

More Telugu News

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11
..more