‘ఇండియన్-2’ ఫస్ట్ లుక్ విడుదల.. సేనాపతి లుక్ లో కమలహాసన్ అదుర్స్!
- మర్మకళను ప్రదర్శిస్తున్నట్లు పోస్టర్
- ఈ నెల 18 నుంచి షూటింగ్ ప్రారంభం
- రెహమాన్ స్థానంలో అనిరుధ్ సంగీతం
ఈ సందర్భంగా అభిమానులకు పొంగల్ శుభాకాంక్షలు తెలిపారు. తండ్రి సేనాపతి పాత్రలో కమల్ మర్మకళ ను ప్రదర్శిస్తున్నట్లు ఉన్న పోస్టర్ ను శంకర్ విడుదల చేశారు. ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెల 18 నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు దర్శక, నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.