ఫేస్‌బుక్‌కు సంబంధించి మరో సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చిన నివేదిక
- 2012లోనే డేటాను విక్రయించాలని నిర్ణయం
- 2014లో నిర్ణయాన్ని మార్చుకున్నారు
- అనుమతులు పెంచుతూ రాబడి కోసం యత్నం
కనీసం 2,50,000 డాలర్లకు తమ వినియోగదారుల ప్రాథమిక వివరాలను వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని 2012లోనే ఫేస్బుక్ సిబ్బంది భావించారని.. కానీ 2014లో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారని నివేదిక స్పష్టం చేసింది. వాల్‌స్ట్రీట్ జనరల్ కూడా తను ప్రచురించిన కథనంలో... వినియోగదారుల సమాచారాన్ని వినియోగించుకొనేందుకు అనుమతులు పెంచుతూ ప్రకటన కర్తల నుంచి మరింత రాబడి పొందవచ్చనే అంశంపై ఫేస్బుక్ ఉద్యోగులు చర్చలు జరిపినట్టు పేర్కొంది.