నా గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారు... మంచిది కాదు: విశాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారు... మంచిది కాదు: విశాల్

  • నా పెళ్లి గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు
  • వార్తల్లో వాస్తవం ఎంతుందో సరిచూసుకోవాలి
  • త్వరలోనే అన్ని విషయాలను అధికారికంగా ప్రకటిస్తా
తమిళ హీరో విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఆయన స్పందించాడు. తన పెళ్లి గురించి వస్తున్న తప్పుడు వార్తలను చూసి ఆశ్చర్యపోతున్నానని చెప్పాడు. మీరు రాస్తున్న వార్తల్లో వాస్తవం ఎంతుందో సరిచూసుకోవాలని... తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం సరికాదని అన్నాడు. ఇది తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశమని...త్వరలోనే తన పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలను అధికారికంగా ఆనందంగా ప్రకటిస్తానని చెప్పాడు. ఈ మేరకు విశాల్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు.
vishal
marriage
kollywood
tollywood

More Telugu News