దేశంలోనే తొలిసారి.. ఏపీలో వాహనాలకు ఇక ఒకటే సిరీస్!

  • ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఒకటే సిరీస్
  • ఏపీ 39తో మొదలు
  • ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్
ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా వాహనాలకు ఒకే సిరీస్‌ నంబరును అమలు చేయాలని నిర్ణయించింది. ‘ఒక రాష్ట్రం-ఒక నంబరు’ విధానంలో భాగంగా ఇకపై కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు ఒకే సిరీస్ నంబరును కేటాయించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అంటే, ఇకపై రాష్ట్రంలోని కొత్త వాహనాలన్నీ ‘ఏపీ 39’ సిరీస్‌తోనే ప్రారంభం అవుతాయి. జిల్లాకో సిరీస్ ఉండదన్నమాట. ఫలితంగా వాహనాలను ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఈ విధానం వల్ల వాహనదారులకు సమయం, సొమ్ము ఆదా అవడమే కాకుండా రవాణాశాఖకు ఆదాయం కూడా పెరుగుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
Go Back to Shorts
Andhra Pradesh
Transport
vehicles
Registration
One number
atchannaidu kinjarapu

More Telugu News