కొడుకుగా సూపర్.. కానీ భర్తగా కాదు: గోవిందాతో బంధంపై భార్య సునీత సంచలన వ్యాఖ్యలు
- కొడుకుగా గోవిందా ఓకే, భర్తగా వద్దంటున్న భార్య సునీత
- కుటుంబం కోసమే బతికారు, జీవితాన్ని ఆస్వాదించలేదని వెల్లడి
- తనపై పెద్ద కుట్ర జరుగుతోందన్న గోవిందా
- గతంలోనూ గోవిందా వివాహేతర సంబంధాలపై సునీత ఆరోపణలు
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గోవిందా మంచి కొడుకు, మంచి తండ్రి కానీ మంచి భర్త మాత్రం కాదని ఆయన భార్య సునీత అహూజా సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవిందా తనకు భర్తగా కాకుండా కొడుకుగా ఉంటే బాగుండేదని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సునీత తమ 40 ఏళ్ల వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "గోవిందా మంచి కొడుకు, సోదరుడు. కానీ, ఒక భర్తగా నాకు కావాల్సినవి వేరు. నాకు పార్టీలకు, డిన్నర్లకు, విహారయాత్రలకు వెళ్లడం అంటే చాలా ఇష్టం. కానీ, ఆయన మాత్రం కుటుంబాన్ని పోషించడం అనే బాధ్యతలోనే పూర్తిగా మునిగిపోయారు. ఆయన వయసు ఇప్పుడు 60 ఏళ్లు, కానీ ఇప్పటివరకూ తన కోసం ఆయన బతకలేదు. ఓ పెద్ద సూపర్‌స్టార్ అయ్యుండి జీవితంలో ఏం చూశారు? ఏమీ లేదు. ఇది నాకు చాలా బాధ కలిగిస్తుంది. అందుకే గోవిందా లాంటి కొడుకు కావాలి కానీ, భర్త వద్దు అని నేను ఎప్పుడూ అంటాను. 40 ఏళ్ల బంధం తర్వాత ఇప్పుడు ఆయన్ను వదిలి వెళ్లలేను, అలా ఆలోచించడం కూడా నేరమే" అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
గత కొంతకాలంగా గోవిందా, సునీత మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. గతంలో గోవిందాకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని సునీత ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, 90వ దశకంలో హీరోలకు ఎఫైర్స్ ఉండటం సాధారణమేనని, తన భర్తపై తనకు నమ్మకం ఉందని ఆమె అన్నారు.
మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలు, జరుగుతున్న చర్చపై గోవిందా ఇటీవల స్పందించారు. తనపై ఒక పెద్ద కుట్ర జరుగుతోందని, అందులో తన కుటుంబ సభ్యులను కూడా వారికి తెలియకుండానే వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మౌనంగా ఉంటే తాను బలహీనుడిగా కనిపిస్తానని, అందుకే ఇప్పుడు స్పందిస్తున్నానని ఆయన వివరించారు. గోవిందా, సునీత 1987లో వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె టీనా అహూజా, కుమారుడు యశవర్ధన్ ఉన్నారు.