నిర్మాతగా విజయ్ దేవరకొండ .. హీరోగా 'పెళ్లిచూపులు' దర్శకుడు?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిర్మాతగా విజయ్ దేవరకొండ .. హీరోగా 'పెళ్లిచూపులు' దర్శకుడు?

  • విజయ్ దేవరకొండ కొత్త బ్యానర్ 
  • తక్కువ బడ్జెట్లో సినిమా 
  • మొదలైన ప్రీ ప్రొడక్షన్ పనులు
విజయ్ దేవరకొండ తాను ఏది చేసినా కొత్తగా వుండాలని కోరుకుంటాడు. నలుగురికీ భిన్నంగా అనిపించే నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు. తాజాగా ఆయన అలాంటి నిర్ణయమే మరొకటి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. హీరోగా వరుస సినిమాలతో బిజీగా వున్న ఆయన, నిర్మాతగా మారడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు.అందుకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. తక్కువ బడ్జెట్లో తన బ్యానర్లో నిర్మించే సినిమా ద్వారా హీరోగా ఆయన పరిచయం చేయాలనుకుంటున్నది ఎవరినో కాదు .. 'పెళ్లి చూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ ను. తనకి 'పెళ్లి చూపులు' ద్వారా మంచి హిట్ ఇచ్చినందుకు కాస్త వెరైటీగా ఆ రుణాన్ని తీర్చుకుంటున్నాడన్న మాట. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయి. త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా దర్శకుడు ఎవరో చూడాలి.       
vijay devarakonda
tarun bhaskar

More Telugu News