చేతికి గాయం కారణంగా ‘రోజా’ చిత్రాన్ని వదులుకున్నా: వెంకటేష్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్2’. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా వెంకటేష్ మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'రోజా' సినిమాలో వాస్తవానికి తాను నటించాల్సిందని వెంకీ చెప్పారు. ‘‘రోజా’ సినిమాను నేను చేయాల్సింది. కానీ ఆ సమయంలో చేతికి గాయం కావడంతో చేయలేకపోయా. దాని గురించి నేనెప్పుడూ బాధ పడలేదు. ఆ సినిమా చేయలేకపోయినా ‘సుందరకాండ’ వంటి కుటుంబ కథా చిత్రాలు ఎన్నో చేశాను. ఏం జరిగినా మన మంచికే అనుకుంటాను’’ అని వెంకీ తెలిపారు.
Go Back to Shorts
Venkatesh
Anil Ravipudi
Varun Tej
Roja
F2

More Telugu News