బాలకృష్ణ చాలా మంచి వ్యక్తి.. ఎన్టీఆర్ కుటుంబంతో నాకు విభేదాలు లేవు: లక్ష్మీపార్వతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలకృష్ణ చాలా మంచి వ్యక్తి.. ఎన్టీఆర్ కుటుంబంతో నాకు విభేదాలు లేవు: లక్ష్మీపార్వతి

  • ఎన్టీఆర్ పై బాలయ్య ఎన్ని సినిమాలు తీసినా అది సగభాగమే అవుతుంది
  • వర్మ సినిమాతోనే ఎన్టీఆర్ జీవితం పూర్తవుతుంది
  • వర్మ మనసులో ఏముందో నాకు తెలియదు
బాలకృష్ణ చాలా మంచి వ్యక్తి అని వైసీపీ నాయకురాలు లక్షీపార్వతి కితాబిచ్చారు. ఎన్టీఆర్ కుటుంబంతో వ్యక్తిగతంగా తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆమె తెలిపారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఈరోజు ఆమె దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, దివంగత ఎన్టీఆర్ పై బాలయ్య ఎన్ని సినిమాలు తీసినా... అది సగభాగమే అవుతుందని అన్నారు. రామ్ గోపాల్ వర్మ తీసే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంతోనే ఎన్టీఆర్ జీవితం పూర్తవుతుందని చెప్పారు. వర్మ విడుదల చేసిన రెండో పాట తనకు బాధను కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్మ మనసులో ఏముందో తనకు తెలియదని చెప్పారు.
Balakrishna
ntr
biopic
ram gopal varma
rgv
lakshmiparvathi
YSRCP
Telugudesam
tollywood

More Telugu News