మూడు సినిమాలతో సందడి చేస్తానంటోన్న నిఖిల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మూడు సినిమాలతో సందడి చేస్తానంటోన్న నిఖిల్

  • విడుదలకి ముస్తాబవుతోన్న 'ముద్ర'
  • సెట్స్ పై ఉన్న 'శ్వాస'
  • మరో ప్రాజెక్టుకి సన్నాహాలు
మొదటి నుంచి కూడా తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూ నిఖిల్ దూసుకుపోతున్నాడు. యూత్ లో మంచి క్రేజ్ వున్న నిఖిల్ అది ఎంతమాత్రం తగ్గకుండా చూసుకుంటున్నాడు. అలా ఆయన చేసిన 'కిరాక్ పార్టీ' క్రితం ఏడాది థియేటర్ల దగ్గర సందడి చేసింది. అప్పటి నుంచి ఆయన తదుపరి సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

నిఖిల్ ఎంత మాత్రం సమయాన్ని వృథా చేయకుండా 'ముద్ర' సినిమా చేశాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన 'శ్వాస' అనే సినిమాతో సెట్స్ పైకి వెళ్లిపోయాడు. ఈ సినిమా కూడా చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. కిషన్ కట్టా అనే కొత్త కుర్రాడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నిఖిల్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

ఈ సినిమా కూడా ఈ ఏడాదే విడుదలవుతుందట. ఈ సినిమా వివరాలను రేపు చెబుతానని ఆయన ట్వీట్ చేశాడు. 'ముద్ర' రిలీజ్ డేట్ ను కూడా రేపే చెప్పేస్తానని అన్నాడు. మొత్తానికి ఈ ఏడాది మూడు సినిమాలతో నిఖిల్ ఒక రేంజ్ లో సందడి చేస్తాడన్న మాట. 
nikhil

More Telugu News