రాకేశ్ ఓ ఫైటర్... నాకు తెలుసు ఆయన కేన్సర్‌ను జయిస్తారు!: హృతిక్ రోషన్ కి ప్రధాని ధైర్య వచనాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాకేశ్ ఓ ఫైటర్... నాకు తెలుసు ఆయన కేన్సర్‌ను జయిస్తారు!: హృతిక్ రోషన్ కి ప్రధాని ధైర్య వచనాలు

  • కేన్సర్ బారినపడిన రాకేశ్ రోషన్
  • భయపడొద్దన్న ప్రధాని
  • కేన్సర్‌ను జయిస్తారంటూ ట్వీట్
స్టార్ నటుడు హృతిక్ రోషన్ తండ్రి రాకేశ్ రోషన్‌కు గొంతు కేన్సర్ సోకిన విషయం విదితమే. ఈ విషయాన్ని నిన్న హృతిక్ రోషన్ స్వయంగా వెల్లడించాడు. విషయం తెలిసిన బాలీవుడ్ దిగ్భ్రమకు లోనైంది. ఇప్పటికే పలువురు నటీనటులు కేన్సర్ బారినపడి పోరాడుతున్నారు.

విషయం తెలిసిన ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేస్తూ మరేం భయపడాల్సిన అవసరం లేదని, రాకేశ్ రోషన్ ఫైటర్ అని పేర్కొన్నారు. కేన్సర్ నుంచి రాకేశ్ త్వరగానే కోలుకుంటారని, ఆందోళన చెందాల్సిన అసవరం లేదని ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ‘‘ప్రియమైన హృతిక్. రాకేశ్ రోషన్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయనో ఫైటర్. బోల్డంత ధైరం ఉంది. నాకు తెలుసు ఆయన కేన్సర్‌ను జయిస్తారు’’ అని మోదీ ట్వీట్ చేశారు.
Hrithik Roshan
Rakesh Roshan
throat cancer
Narendra Modi
fighter
courage

More Telugu News