ప్రకాశం జిల్లాలో భారీ కాగితపు పరిశ్రమ.. నేడు చంద్రబాబు శంకుస్థాపన
- రామాయపట్నం సమీపంలో పరిశ్రమ ఏర్పాటు
- రూ. 24 వేల కోట్ల పెట్టుబడి
- స్థాపించనున్న ఇండోనేషియా కంపెనీ
ఈ పరిశ్రమ ద్వారా 15 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లోని 60 వేల మంది సుబాబుల్, యూకలిప్టస్ సాగు రైతులకు ప్రయోజనం కలుగుతుంది. కాగా, నేడు రామాయపట్నం పోర్టుకు కూడా చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పోర్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.