'మరో చరిత్ర'లో నుంచి నన్ను తీసేద్దామనే అనుకున్నారు: సీనియర్ హీరోయిన్ సరిత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మరో చరిత్ర'లో నుంచి నన్ను తీసేద్దామనే అనుకున్నారు: సీనియర్ హీరోయిన్ సరిత

  • కమల్ తో తొలిరోజు షూటింగ్ 
  • డైలాగ్ చెప్పలేకపోయాను 
  • వెనక్కి పంపించేద్దామని అనుకున్నారు
బాలచందర్ 'మరో చరిత్ర' సినిమాతో వెండితెరకి సరిత పరిచయమయ్యారు. ఆ సినిమా విశేషాలను గురించి ఆమె తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడారు. "ఈ సినిమా మొదటి రోజు షూటింగులో నేను యాక్ట్ చేయలేకపోయాను. కమలహాసన్ గారిని చూస్తుంటే డైలాగ్ గుర్తుకురావడంలేదు .. డైలాగ్ వస్తే ఎక్స్ ప్రెషన్ రావడం లేదు. టేకులపై టేకులు .. ఎక్స్ ప్రెషన్ రావడం లేదు.

దాంతో నన్ను తీసేసి శ్రీదేవిని పెట్టుకోమని బాలచందర్ గారిని నిర్మాత వత్తిడి చేయడం మొదలు పెట్టారు. ఆల్రెడీ శ్రీదేవికి ఒక మాట చెప్పి ఉంచినట్టున్నారు. 'మరో రోజు చూద్దాం .. అమ్మాయికి కొత్త కదా' అని బాలచందర్ గారు నిర్మాతకి నచ్చజెప్పారట. ఆ మరుసటి రోజున పెద్ద సీన్ ఇచ్చారు .. ఒక రకంగా నాకు టెస్ట్ పెట్టారనే అనుకోవాలి. దేవుడి దయవల్ల సీన్ వెంటనే ఓకే అయింది. ఆ రోజున సరిగ్గా చేయపోతే నన్ను పంపించేద్దామని నిర్మాత టికెట్ కూడా తీశారట" అని చెప్పుకొచ్చారు. 
saritha
kamal

More Telugu News