తెలంగాణ తొలి కేబినెట్ సమావేశం.. పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం
- 17 నుంచి అసెంబ్లీ నిర్వహణ నేపథ్యంలో భేటీ
- పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం
- నామినేటెడ్ కోటా భర్తీపై నిర్ణయం
అలాగే, ఆంగ్లో ఇండియన్ కోటా ఎమ్మెల్యే భర్తీపైనా చర్చిస్తారని సమాచారం. తొలిసారి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగిన స్టీఫెన్సన్కే మళ్లీ ఈ కోటాలో అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు. శాసన సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశం కావడంతో పలు కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు, 19న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపైనా చర్చించనున్నారు.