అమెరికాలో బాలయ్య వర్సెస్ రజనీకాంత్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలో బాలయ్య వర్సెస్ రజనీకాంత్

  • 9న బాలయ్య 'కథానాయకుడు' విడుదల
  • 10న రజనీ 'పేట' రిలీజ్
  • వెంటనే 'వినయ విధేయ రామ', 'ఎఫ్2' చిత్రాల సందడి
అమెరికాలో ఈ సంక్రాంతి మరింత సందడిగా జరగనుంది. నాలుగు భారీ చిత్రాలు సంక్రాంతి సందర్భంగా యూఎస్ లో సందడి చేయనున్నాయి. ఈ నెల 9న బాలయ్య నటించిన 'కథానాయకుడు', 10న రజనీకాంత్ నటించిన 'పేట' సినిమాలు రిలీజ్ కానున్నాయి. 'కథానాయకుడు' చిత్రాన్ని ప్రదర్శించబోయే థియేటర్స్ లిస్ట్ ను ఇప్పటికే రిలీజ్ చేశారు. ప్రీమియర్ షో బుకింగ్స్ కూడా పూర్తయ్యాయి.

మరోవైపు, రజనీకాంత్ సినిమా తమిళ వర్షన్ కోసం భారీ సంఖ్యలోనే థియేటర్లను బుక్ చేశారు. ఈ రెండు సినిమాలతో యూఎస్ థియేటర్లు ఫుల్ అయినట్టు సమాచారం. ఈ సినిమాలు విడుదలైన వెంటనే 11న రాంచరణ్ నటించిన 'వినయ విధేయ రామ'... 12న వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన 'ఎఫ్2' సినిమాలు సందడి చేయనున్నాయి.
america
petta
kathanayakudu
vinaya vidheya rama
f2
Balakrishna
Rajinikanth
venkatesh
varun tej
Tollywood
kollywood

More Telugu News