యాక్షన్ ఎంటర్టైనర్ గా 'వజ్రకవచధర గోవిందా'
Add ap7am to your home Screen

యాక్షన్ ఎంటర్టైనర్ గా 'వజ్రకవచధర గోవిందా'

  • సప్తగిరి హీరోగా 'వజ్రకవచధర గోవిందా'
  • దర్శకుడిగా అరుణ్ పవార్ 
  • త్వరలోనే మిగతా వివరాలు  
తెలుగు తెరపై సందడి చేస్తోన్న కమెడియన్స్ లో సప్తగిరి ఒకరు. డైలాగ్ డెలివరీలోను .. బాడీ లాంగ్వేజ్ లోను సప్తగిరి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కమెడియన్ గా మంచి క్రేజ్ రావడంతో హీరోగా అవకాశాలు వచ్చాయి. దాంతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో సప్తగిరి వున్నాడు. గతంలో హీరోగా సప్తగిరి చేసిన 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' ఆయనకి మంచి మార్కులు తెచ్చిపెట్టింది.

అదే దర్శకుడు అరుణ్ పవార్ దర్శకత్వంలో సప్తగిరి మళ్లీ ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాడు. నరేంద్ర .. జీవీఎన్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి, 'వజ్రకవచధర గోవిందా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది. హీరోగా నిలదొక్కుకోవడానికి సప్తగిరి చేస్తున్న ప్రయత్నాలు ఈ సినిమాతోనైనా ఫలిస్తాయేమో చూడాలి. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
saptagiri

More Telugu News