పాకిస్థాన్ లోని బందీలను విడిపించండి: కేంద్రానికి చంద్రబాబు లేఖ

  • పొట్టకూటి కోసం గుజరాత్ కు వెళ్లిన మత్స్యకారులు
  • పాక్ జైళ్లలో మగ్గుతున్న 22 మంది మత్స్యకారులు
  • విడిపించాలంటూ రాజ్ నాథ్, సుష్మాస్వరాజ్ లకు లేఖ
కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ లకు ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. పాకిస్థాన్ జైళ్లలో బందీలుగా ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులను విడిపించాలని లేఖలో కోరారు. పొట్టకూటి కోసం శ్రీకాకుళం జిల్లా నుంచి గుజరాత్ కు వెళ్లిన మత్స్యకారులు... పాకిస్థాన్ చెరలో చిక్కుకున్నారని తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో తాత్కాలిక హైకోర్టును ప్రారంభించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, 22 మంది మత్స్యకారులకు చెందిన 11 కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. 
Go Back to Shorts
Chandrababu
sushma swaraj
rajnath singh
letter
fishermen

More Telugu News