అయితే చంద్రబాబును సీఎంను చేసింది కూడా కేసీఆరేగా?: బాల్క సుమన్ లాజిక్
- నాడు వైస్రాయ్ హోటల్ ఘటన గురించి ప్రస్తావన
- ఆ ఘటనకు సిద్ధాంత కర్త కేసీఆరే నని బాబు అన్నారు
- తనను సీఎం చేసిందీ కేసీఆరేనని బాబు ఒప్పుకున్నట్టే
కేసీఆర్ ని ఇంత పెద్ద నాయకుడిని చేసింది తానేనని చెప్పుకునే అర్హత చంద్రబాబుకు ఎక్కడుంది? అని మండిపడ్డారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం చంద్రబాబు నైజమని, బాబు డ్రామాలు అర్థమైపోయాయని, ఇంకా ఎక్కువ రోజులు ఆ డ్రామాలు నడవవని దుయ్యబట్టారు. ఏపీ మంత్రులు పోటీపడి మరీ, కేసీఆర్ ని విమర్శించారని అన్నారు. కేసీఆర్ ఒక విషయం గురించి మాట్లాడితే చంద్రబాబు మరో విషయం గురించి మాట్లాడుతున్నారని, ఇలాంటి డ్రామాలతోనే కాలం గడుపుకుంటూ ఆయన వస్తున్నారని అన్నారు.