'కదరం కొందన్' నుంచి ఆసక్తిని రేపుతోన్న విక్రమ్ లుక్

తెలుగు .. తమిళ భాషల్లో విక్రమ్ కి విపరీతమైన క్రేజ్ వుంది. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో విలక్షణ నటుడిగా ఆయన ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. అదే పద్ధతిని పాటిస్తూ ఆయన మరో విభిన్నమైన సినిమాను చేస్తున్నాడు .. ఆ చిత్రం పేరే 'కదరం కొందన్'. కమలహాసన్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో విక్రమ్ సరసన అక్షర హాసన్ కథానాయికగా కనిపించనుంది. గిబ్రాన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన ఫస్టులుక్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరోలుక్ ను వదిలారు .. విక్రమ్ ను డిఫరెంట్ గా చూపుతోన్న ఈ లుక్ కూడా ఆసక్తిని రెత్తిస్తోంది. రాజేశ్ సెల్వ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను తెలుగులోను విడుదల చేయనున్నారు. తన కెరియర్లో ప్రత్యేకంగా నిలిచిన చిత్రాల జాబితాలో ఈ సినిమా కూడా నిలవడం ఖాయమనే నమ్మకంతో విక్రమ్ .. ఆయన అభిమానులు వున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. 

vikram
akshara

More Telugu News