ఏపీ హైకోర్టుపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు

  • హైకోర్టు నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతుందని ప్రశ్నించిన సీఎం
  • జనవరి 22 నాటికి పూర్తవుతుందన్న నిర్మాణ సంస్థ
  • క్యాంపు కార్యాలయంలో కోర్టు హాళ్లను సిద్ధం చేస్తున్న అధికారులు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతుందని అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు. జనవరి 22 నాటికి పూర్తి చేస్తామని హైకోర్టును నిర్మిస్తున్న కాంట్రాక్టు సంస్థ తెలిపింది. నెలాఖరు వరకు సమయం తీసుకుని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆదేశించారు.

హైకోర్టు పూర్తయ్యేంత వరకు సీఎం క్యాంపు కార్యాలయంలో తాత్కాలిక హైకోర్టును ఏర్పాటు చేయాలని, స్టేట్ గెస్ట్ హౌస్ ను పాలనా సిబ్బందికి కేటాయించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో, క్యాంపు కార్యాలయంలో కోర్టు హాళ్లను సీఆర్డీయే అధికారులు యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. నేలపాడు గ్రామంలో హైకోర్టు భవనాన్ని ఎల్ అండ్ టీ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Chandrababu
High Court
review
Andhra Pradesh

More Telugu News