'ఇక నాలో బ్యాడ్ బాయ్ ని చూడండి' అంటూ ఫొటో పోస్ట్ చేసిన హీరో రామ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఇక నాలో బ్యాడ్ బాయ్ ని చూడండి' అంటూ ఫొటో పోస్ట్ చేసిన హీరో రామ్

  • రామ్ 17వ సినిమాకి రంగం సిద్ధం 
  • దర్శక నిర్మాతగా పూరి జగన్నాథ్ 
  • కొత్త లుక్ తో కనిపించనున్న రామ్   
యూత్ లో రామ్ కి మంచి క్రేజ్ వుంది .. అయితే ఇటీవల ఆయన చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో మంచి కథకోసం వెయిట్ చేస్తూ గ్యాప్ తీసుకున్న రామ్, తాజాగా పూరి జగన్నాథ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా ఈ సినిమాను గురించి రామ్ ప్రస్తావించాడు. 'నన్ను మంచివాడిగా చూసి బోర్ కొట్టిందా .. అయితే ఇప్పుడు చెడ్డవాడిగా చూడండి' అంటూ పూరి .. ఛార్మితో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశాడు.

బోల్డ్ కంటెంట్ తో ఈ సినిమా రూపొందనున్నట్టు రామ్ చెప్పాడు. ఈ సినిమాలో రామ్ కొత్తలుక్ తో కనిపించనున్నట్టు తెలుస్తోంది. రామ్ కి ఇది 17వ సినిమా .. పూరి జగన్నాథ్ సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. ప్రస్తుతం కథానాయికల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే కథానాయికలు ఎవరనే విషయాన్ని వెల్లడించనున్నారు. ఈ సినిమా తప్పకుండా తనకి హిట్ ఇస్తుందనే నమ్మకంతో రామ్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి. 
ram
puri

More Telugu News