'భారతీయుడు-2’ కోసం కొత్త విద్యలు నేర్చుకుంటున్నాను: హీరోయిన్ కాజల్
- ‘మగధీర’తో నా సినీ కెరీర్ లో గోల్డెన్ పిరీడ్ మొదలు
- ఈ సినిమా నాకు ఎంతో ప్రజాదరణ, గుర్తింపు తెచ్చాయి
- ‘భారతీయుడు-2’తో నా కెరీర్ మరోస్థాయికి వెళుతుంది
‘మగధీర’కు సంతకం చేసిన రోజు నుంచే నటిగా తన గోల్డెన్ పిరీడ్ మొదలైందని చెప్పింది. ఈ సినిమా తనకు ఎంతో ప్రజాదరణ, గుర్తింపు తెచ్చాయని, ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నానని సంతోషం వ్యక్తం చేసింది. ఇక, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భారతీయుడు-2’ చిత్రంలో తాను నటిస్తుండటం చాలా థ్రిల్లింగ్ గా ఉందని, ఈ సినిమా కోసం కొత్త విద్యలు నేర్చుకుంటున్నానని చెప్పింది. ‘భారతీయుడు-2’ చిత్రం తన సినీ కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళుతుందని ఆశిస్తున్నట్టు కాజల్ చెప్పింది.