ఐదుగురితో వివాహం.. మరో 21 మంది యువతుల ట్రాప్.. మోసగాడిని అరెస్ట్ చేసిన పోలీసులు!

అప్పటికే ఐదుగురిని పెళ్లి చేసుకున్న ఓ మోసగాడు, మరో 21 మంది యువతులను వివాహం చేసుకుంటానని ట్రాప్ చేశాడు. అయితే ఇతని చేతిలో మోసపోయిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

హరియాణాకు చెందిన అభిషేక్ వశిష్ట్ ఉరఫ్ అభినవ్ అభిరుద్రాంశ్‌ ప్రధానంగా విడాకులు తీసుకున్న యువతులను టార్గెట్ చేస్తుంటాడు. పెళ్లి వెబ్ సైట్లలో తనను తాను ఓ మీడియా సంస్థ యజమానిగా పరిచయం చేసుకుంటాడు. తియ్యటి మాటలు కలుపుతూ పెళ్లి చేసుకుందామని లొంగదీసుకుంటాడు. చివరికి తన కోరిక తీరగానే అడ్రస్ లేకుండా పారిపోతాడు.

ఇలా ఈ ప్రబద్ధుడు ఇప్పటివరకూ ఐదుగురిని వివాహం చేసుకుని మోసం చేశాడు. మరో 21 మంది అమ్మాయిలను ట్రాప్ చేశాడు. అయితే ఇతని బారినపడ్డ ఓ యువతి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అభిషేక్ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు హరిద్వార్ లో అతడిని పట్టుకున్నారు. అనంతరం కోర్టు ముందు హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు.
Go Back to Shorts
India
New Delhi
Crime News
Cheating
5 marriages
21 girls trap
Police
arrest

More Telugu News