భువనేశ్వర్ లో కేసీఆర్ కు ఘన స్వాగతం.. రాత్రికి నవీన్ పట్నాయక్ నివాసంలో బస
- భువనేశ్వర్ చేరుకున్న కేసీఆర్
- కాసేపట్లో నవీన్ పట్నాయక్ తో భేటీ
- ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చ
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఈ రాత్రికి నవీన్ పట్నాయక్ అధికార నివాసంలో కేసీఆర్ బస చేయనున్నారు. రేపు ఉదయం రోడ్డు మార్గాన కోణార్క్ సూర్య దేవాలయం, పూరీ జగన్నాథుడి ఆలయాలను దర్శించుకుంటారు. అనంతరం భువనేశ్వర్ నుంచి కోల్ కతా బయలుదేరుతారు. అక్కడ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఆయన భేటీ అవుతారు.