చరిత్రకు జయాలు, అపజయాలు ఉండవు.. చరిత్ర సృష్టించడమే ఉంటుంది: జూనియర్ ఎన్టీఆర్
- తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఇంటికీ చెందిన వ్యక్తి ఎన్టీఆర్
- ఎన్టీఆర్ ది ఓ చరిత్ర..
- ఎన్టీఆర్ విజయం సాధించడం వల్లే ఈ బయోపిక్ మొదలైంది
ఆ మహానుభావుడి చరిత్రను మా తరానికి, ముందు తరాలకు తీసుకెళ్తున్న బాబాయ్ బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా సరిపోదంటూ భావోద్వేగం చెందారు. ఎన్టీఆర్ ది ఓ చరిత్ర అని, ఇటువంటి చరిత్రను భావితరాలకు అందిస్తున్నందుకు ఇది విజయం సాధించాలని తాను కోరుకోనని, ఎందుకంటే, ఎన్టీఆర్ విజయం సాధించడం వల్లే ఈ బయోపిక్ మొదలైందని, చరిత్రకు విజయాలు, అపజయాలు ఉండవని, కేవలం చరిత్ర సృష్టించడమే ఉంటుందని అన్నారు.