Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కామెడీ పండించడం కష్టమేనండోయ్: హీరో వరుణ్ తేజ్

  • ఓ వైపున వెంకటేశ్ .. మరో వైపున రాజేంద్ర ప్రసాద్ 
  • ఇద్దరూ కామెడీని పండించడంలో తిరుగులేనివాళ్లే 
  • అలాంటి వాళ్లతో కలిసి కామెడీ అంటే మాటలా?    
ఈసారి సంక్రాంతి బరిలో వరుణ్ తేజ్ సినిమా కూడా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' అనే మల్టీస్టారర్ రూపొందింది. ఈ సినిమాలో ఒక హీరోగా వెంకటేశ్ నటించగా .. మరో హీరోగా వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాను గురించి వరుణ్ తేజ్ మాట్లాడుతూ .. "ఈ సినిమా కామెడీ ప్రధానంగా సాగుతుందని చెప్పినప్పుడు నేను కొంచెం కంగారు పడ్డాను. రాజేంద్రప్రసాద్ .. వెంకటేశ్ తో కలిసి కామెడీని పండించవలసి ఉంటుందని చెప్పినప్పుడు మరికొంచెం టెన్షన్ పడ్డాను.

ఆ ఇద్దరూ కామెడీని పండించడంలో లెజెండ్స్ .. అలాంటివాళ్లతో కలిసి కామెడీ సీన్స్ చేయడం అంత ఆషామాషీ విషయం కాదనిపించింది. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి నా బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా నా వైపు నుంచి కామెడీ ఉండేలా రాసుకొచ్చాడు. కాస్తంత కష్టంగా అనిపించినా, తెలంగాణ యాసలో మాట్లాడుతూ బాగానే కామెడీ చేశానని అనుకుంటున్నాను. ఎలా చేశాననేది సినిమా చూశాక మీరే చెప్పాలి" అని అన్నాడు. 
venkatesh
varun tej

More Telugu News