'తుపాకి' సీక్వెల్ పై దృష్టి పెట్టిన మురుగదాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'తుపాకి' సీక్వెల్ పై దృష్టి పెట్టిన మురుగదాస్

  • రజనీతో మురుగదాస్ మూవీ 
  • మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగే కథ 
  • తదుపరి సినిమాలు అజిత్ .. విజయ్ లతో    
ప్రస్తుతం రజనీకాంత్ తో సినిమా చేయడానికి మురుగదాస్ రెడీ అవుతున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని ముందుగానే చెప్పేశాడు. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుతో సెట్స్ పైకి వెళ్లడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఈ సినిమా తరువాత అజిత్ తో ఒక సినిమా .. విజయ్ తో ఒక సినిమా చేయనున్నట్టు కూడా మురుగదాస్ సంకేతాలిచ్చాడు. ఇంతకుముందు విజయ్ తో 'కత్తి' .. 'తుపాకి' చేసిన మురుగదాస్, ఇటీవల చేసిన 'సర్కార్'తో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. విజయ్ తో మురుగదాస్ చేసే సినిమా .. 'తుపాకి' సీక్వెల్ అనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి మురుగదాస్ స్టార్ హీరోలందరినీ లైన్లో పెట్టేశాడని కొంతమంది అనుకుంటుంటే, ఎప్పుడో చేసే సినిమాలు గురించిన విషయాలు ఇప్పుడు అవసరమా? అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. 
murugadoss
ajith
vijay

More Telugu News