ఎన్టీఆర్ గారు విసురుగా లాగేయడంతో కిందపడిపోయాను: సీనియర్ హీరోయిన్ లత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్టీఆర్ గారు విసురుగా లాగేయడంతో కిందపడిపోయాను: సీనియర్ హీరోయిన్ లత

  • 'నిప్పులాంటి మనిషి' రెండు భాషల్లో తీశారు 
  • తెలుగులో ఎన్టీఆర్ హీరో 
  • తమిళంలో హీరో ఎంజీఆర్
తాజాగా 'ఆలీతో సరదాగా'కార్యక్రమంలో అలనాటి అందాల నటి లత పాల్గొని, 'నిప్పులాంటి మనిషి' సినిమా షూటింగులో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి చెప్పారు. "తెలుగు .. తమిళ భాషల్లో 'నిప్పులాంటి మనిషి' షూటింగు జరుగుతోంది. తెలుగులో ఎన్టీఆర్ హీరో అయితే తమిళంలో ఎంజీఆర్ గారు హీరో. ఈ రెండు భాషల్లోను నేనే హీరోయిన్.

తమిళ వెర్షన్ కి సంబంధించిన ఒక సీన్ ను పూర్తి చేశాను. అదే సీన్ ను తెలుగులో ఎన్టీఆర్ గారితో చిత్రీకరిస్తున్నారు. ఆ సీన్లో ఎన్టీఆర్ గారు నన్ను విసురుగా లాగేసి కాస్త ముందుకువెళ్లి డైలాగ్ చెప్పాలి. ఆయనలా విసురుగా లాగడంతో నేను కిందపడిపోయాను. ఎన్టీఆర్ గారు చూసుకోలేదు .. ముందుకు వెళ్లి డైలాగ్ చెబుతూనే వున్నారు. దర్శకుడు ఎస్.డి. లాల్ కట్ చెప్పేసి .. నేను పడిపోయినట్టు ఎన్టీఆర్ గారికి చెప్పారు. అప్పుడు ఆయన నా దగ్గరికి వస్తూ 'ఎప్పుడండీ పడిపోయారు .. సారీ .. సారీ .. దెబ్బలేమైనా తగిలాయా?' అని అడిగారు" అంటూ చెప్పుకొచ్చారు. 
latha
ali

More Telugu News