తెలంగాణలో మరో రెండు కొత్త జిల్లాలు.. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

  • కొత్త జిల్లాలుగా ములుగు, నారాయణపేట్
  • ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి
  • గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం
తెలంగాణ పల్లెల రూపు రేఖలను మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నద్ధమయ్యారు. పచ్చదనం, పరిశుభ్రత ఉట్టిపడేలా గ్రామాలను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్ లో పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు ఆదేశించారు.

అంతేకాదు, మరో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ములుగు, నారాయణపేట్ లను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని చెప్పారు. గ్రామాలు బాగుంటేనే రాష్ట్రాలు, దేశం బాగుంటాయని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించాలని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు పూర్తైన వెంటనే గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను పెంచే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు.
Go Back to Shorts
kcr
telangana
new districts

More Telugu News