వరుసగా రెండు వికెట్లు తీసిన షమీ... ఆరు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
- భారీ స్కోరు దిశగా సాగుతున్న ఆస్ట్రేలియాకు బ్రేక్
- ఫైనీ, ఖావాజా వికెట్లు తీసిన మహమ్మద్ షమీ
- ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 192/6
లంచ్ తరువాత రెండో ఓవర్ లోనే పరిస్థితి మారిపోయింది. 79వ ఓవర్ ను వేసిన షమీ, తన ఐదో బంతిలో పైనీని, ఆరో బంతిలో ఫించ్ ని అవుట్ చేశాడు. షమీ వేసిన బంతిని పైనీ ఆడగా, దాన్ని కోహ్లీ క్యాచ్ పట్టాడు. తరువాతి బంతికే ఫించ్ ని అవుట్ చేశాడు. దీంతో క్రీజులో నిలదొక్కుకుని ఉన్న ఇద్దరు ఆటగాళ్లు పెవీలియన్ కు చేరినట్లయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 6 వికెట్ల నష్టానికి 192 పరుగులు.