విశాఖ-నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. ప్రయాణికుల బెంబేలు
- మంటలకు ఆహుతైన రెండు బోగీలు
- విశాఖ-నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
- కాజీపేటలో మరమ్మతు
విశాఖ నుంచి వస్తున్న ఎక్స్‌ప్రెస్ వరంగల్ చేరుకుంటున్న సమయంలో ఏసీ కోచ్ నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు కాజీపేట రైల్వే అధికారులకు సమాచారం చేరవేశారు. రైలు ఉదయం 6:45 గంటలకు కాజీపేట జంక్షన్‌కు చేరుకోగానే అప్పటికే సిద్ధంగా ఉన్న మెకానికల్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అనంతరం మరమ్మతులు చేసి 7:15 గంటలకు రైలును పంపించారు.