వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే!
- ఒంగోలుకు వచ్చిన గిద్దరూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు
- బాలినేనితో చర్చలు
- నెలాఖరులో వైసీపీ కండువా
కాగా, గత ఎన్నికల అనంతరం రాంబాబు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ, ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆపై వైకాపాలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేయగా, రెండు రోజుల క్రితం జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన తన అనుచరులతో వచ్చి బాలినేనిని కలిశారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ, గిద్దలూరులో వైసీపీ గెలుపే లక్ష్యంగా కృషి చేస్తానని అన్నారు. 26 లేదా 27 తేదీల్లో ఆయన పార్టీలో చేరుతారని సమాచారం.