నాని సినిమాలో ఐదుగురు హీరోయిన్స్!

ప్రస్తుతం నాని 'జెర్సీ' సినిమాతో బిజీగా వున్నాడు. ఒక వైపున ఈ సినిమా షూటింగును చకచకా కానిచ్చేస్తూనే, మరో వైపున తదుపరి సినిమాకి అవసరమైన పనులను చక్కబెడుతున్నాడు. నాని తదుపరి సినిమా .. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనుల్లోనే విక్రమ్ కుమార్ వున్నాడు.

ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తోంది. ప్రధానమైన కథానాయికగా ఒకరే కనిపిస్తారనీ .. మిగతావాళ్లు కీలక పాత్రధారులుగా ఉంటారని అంటున్నారు. ఈ ఐదుగురు కథానాయికలను ఎంపిక చేసే పనులు చురుకుగా జరుగుతున్నాయట. మరి ఆ కథానాయికలుగా ఎవరెవరిని అవకాశాలు వరించనున్నాయో చూడాలి. ఇంతవరకూ ఒకరు ..లేదా ఇద్దరు కథానాయికలతో తెరపై సందడి చేసిన నాని, ఐదుగురు కథానాయికలతో ఎలా అలరించనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.     
Go Back to Shorts
nani
vikram kumar

More Telugu News