ఏపీలో చంద్రబాబే కొనసాగాలి: సినీ నటుడు సుమన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీలో చంద్రబాబే కొనసాగాలి: సినీ నటుడు సుమన్

  • టీఆర్ఎస్ గెలుపును ముందే ఊహించా
  • అభివృద్ధే టీఆర్ఎస్‌ను గెలిపించింది
  • తెలంగాణలో టీఆర్ఎస్.. ఏపీలో టీడీపీ కొనసాగాలనేదే నా ఆశ
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడి ప్రభుత్వం కొనసాగాలనేదే తన ఆకాంక్ష అని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. వీటిలో ఒకటి నెరవేరిందని, రెండోది నెరవేరాలని పేర్కొన్నారు. తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుందని తాను ముందే చెప్పానన్నారు. అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో టీడీపీ ప్రభుత్వాలు కొనసాగాలనేదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు.

అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. కూటమి పేరుతో ఒక్కటైన విపక్షాలను చిత్తు చేసి ఏకంగా 88 స్థానాలు దక్కించుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం నేడు కొలువుదీరబోతోంది.
Chandrababu
Andhra Pradesh
TRS
KCR
Telugudesam
Suman
Tollywood

More Telugu News