ఏపీ ప్రయాణికుల బోగీలను ఆక్రమించుకున్న బిహారీలు.. దిగబోమంటూ దౌర్జన్యం!
- రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ఘటన
- పట్నా-యర్నాకుళం బోగీల ఆక్రమణ
- ఎట్టకేలకు బిహారీలకు నచ్చజెప్పిన పోలీసులు
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు.. బిహార్ ప్రయాణికులను దిగాల్సిందిగా కోరారు. అయితే తాము అధికారులకు జరిమానా చెల్లించామనీ, రిజర్వేషన్ బోగీ నుంచి దిగబోమని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు వీరిని బలవంతంగా రైలు నుంచి దించారు. పోలీసుల చర్యతో ఆగ్రహానికి లోనైన బిహారీలు.. రైలు ఇంజన్ ముందు నిలబడి ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ‘మిమ్మల్ని మరో రైలులో పంపుతాం’ అని అధికారులు హామీ ఇవ్వడంతో బిహారీలు వెనక్కి తగ్గారు. దీంతో ఏపీ ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటూ కేరళకు బయలుదేరారు.