ప్రియాంకతో నిక్ది బలవంతపు వివాహమంటూ రాసిన కథనంపై క్షమాపణలు కోరిన పాత్రికేయురాలు
- కథనంపై తీవ్ర విమర్శలు
- మిమ్మల్ని బాధపెట్టినందుకు క్షమించండి
- కథనం పూర్తి బాధ్యతను తీసుకుంటున్నా
ఈ కథనంపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో మ్యాగజైన్ పాత్రికేయురాలు మారియా స్మిత్ క్షమాపణ కోరుతూ ట్వీట్ చేశారు. ‘నా మాటలతో మిమ్మల్ని బాధపెట్టినందుకు ప్రియాంకా చోప్రాకు, నిక్ జొనాస్కు, పాఠకులకు నిజాయతీగా క్షమాపణలు చెబుతున్నా. నేను రాసిన కథనం పూర్తి బాధ్యతను తీసుకుంటున్నా. నేను తప్పు చేశా. నిజంగా క్షమించమని కోరుతున్నా’ అని ఆమె ట్వీట్ చేశారు.