ప్రజల గొంతుకను వినిపించేందుకే మేము ఏకమయ్యాం: ప్రజాకూటమి నేత ఎల్.రమణ

  • ప్రజలు మా వైపే ఉన్నారు
  • పోలింగ్ నాటికి కూటమికి ఆదరణ బాగా పెరిగింది
  • 80 స్థానాల వరకు మా కూటమి సాధిస్తుంది
ప్రజల గొంతుకను వినిపించేందుకే తాము ప్రజాకూటమి ద్వారా ఏకమయ్యామని టీ-టీడీపీ  అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. హైదరాబాద్ లోని గోల్కోండ హోటల్లో ప్రజాకూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ ఎన్నిరకాలుగా ప్రభావితం చేసినప్పటికీ, ప్రజలు ప్రజాకూటమివైపే ఉన్నారని, పోలింగ్ నాటికి ప్రజాకూటమికి ఆదరణ బాగా పెరిగిందని అన్నారు.

 80 స్థానాల వరకు తమ కూటమి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. కేసీఆర్ అర్ధాంతరంగా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారని, కేసీఆర్, ఆయన కుటుంబం, ఆయన అనుయాయులు ఈ ఎన్నికల్లో వందల కోట్లు వెదజల్లినా ప్రజలు తమ వైపే ఉన్నారని అన్నారు.  
Go Back to Shorts
praja kutami
t-congress
t-Telugudesam
L ramana

More Telugu News