2 రోజుల కోసం 2 కోట్ల సెట్ .. శంకర్ అంటే అంతేమరి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

2 రోజుల కోసం 2 కోట్ల సెట్ .. శంకర్ అంటే అంతేమరి!

  • శంకర్ నుంచి 'భారతీయుడు 2'
  • కమల్ సరసన నాయికగా కాజల్ 
  • చైనా నుంచి సెట్ మెటీరియల్  
 బలమైన కథాకథనాలకు భారీతనాన్ని జోడించి తెరపై అద్భుతంగా ఆవిష్కరించడం శంకర్ ప్రత్యేకత. రజనీతో ఒక భారీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి 'ఔరా!' అనిపించిన ఆయన, తన తదుపరి సినిమాను కమల్ తో ప్లాన్ చేశాడు. గతంలో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న 'భారతీయుడు'కి ఇది సీక్వెల్. 'భారతీయుడు 2'గా ఈ సినిమా రూపొందుతోంది.

కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా కోసం ఒక భారీ సెట్ వేయిస్తున్నారు. ఈ సెట్ మొత్తం కూడా గోల్డ్ కలర్లో మెరుస్తూ కనిపిస్తుంది. ఈ సెట్ కి అవసరమైన మెటీరియల్ మొత్తాన్ని చైనా నుంచి తెప్పిస్తున్నారు. అందువలన కేవలం ఈ సెట్ కోసం 2 కోట్లు ఖర్చు అవుతోందట. ఇంత ఖర్చుచేసి వేసిన సెట్లో షూటింగు చేసేది రెండే రోజులట. 2 రోజుల కోసమే 2 కోట్లు ఖర్చు చేస్తున్నారంటే, ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే వుండనుందని కోలీవుడ్లో చెప్పుకుంటున్నారు. 
kamal
kajal

More Telugu News